- Advertisement -
భాష్పవాయువు, వాటర్‌కేనన్ల ప్రయోగం
కొలంబో : శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశంలో విధించిన 36 గంటల కర్ఫూ గడువు ముగిసినా పలు ప్రాంతాలలో జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతరం చేశారు. సోమవారం నిషేధాజ్ఞలు ధిక్కరించి రెండువేల మంది నిరసనకారులు తంగాలేలోని ప్రధాని మహీందా రాజపక్సా నివాసంపై దాడికి యత్నించారు. నివాసంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు దూసుకువెళ్లారు. పోలీసులు వారిని అటకాయించారు. కొలంబోకు 200 కిలోమీటర్ల దూరంలో ప్రధాని నివాసం కార్లటన్ ఉంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని నిరసిస్తూ ప్రధాని వ్యతిరేక నినాదాలకు దిగుతూ జనం బారికేడ్లు ఛేదించుకుని ముందుకు సాగారు. వీరిని నిలిపివేసేందుకు పోలీసులు భద్రతా బలగాలు వాటర్ కేనన్లు, భాష్ఫవాయువు ప్రయోగించాయి. దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి భారీస్థాయిలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి.
- Advertisement -