Monday, December 23, 2024

జమ్మూకశ్మీర్‌లో గ్రామంపై దాడి: స్థానికుల నిరసన

- Advertisement -
- Advertisement -
విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు
నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు

రాజౌరి: జమ్మూకశ్మీర్ స్థానికులు రాజౌరి జిల్లాలోని ధన్‌గ్రీపై జరిగిన దాడికి నిరసన ప్రదర్శించారు. హిందువుల మూడు ఇండ్లపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురిని గాయపరిచిన ఘటనపై వారు ఈ నిరసన చేపట్టారు.
స్థానికులు జమ్ము డివిజన్‌లోని ధన్‌గ్రి అనే కొండప్రక్క గ్రామంలో ఉన్న ప్రధాన చౌకలో గుమిగూడి పోలీసులు, జిల్లా పాలకవర్గంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను జెకె లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వినాలని కూడా డిమాండ్ చేశారు. పాలకవర్గానికి వ్యతిరేకంగా స్థానికులు రాజౌరి బంద్‌కు పిలుపునిచ్చారు. ‘లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా హోష్ మే ఆవో(స్పృహలోకి రండి)’ అని నిరసనకారులు నినదించారు.

పోలీసుల కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అందులో నలుగురు చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మూడు దూరదూరంగా ఉన్న ఇండ్లపై ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల ఘటన రాత్రి 7.00 గంటలకు జరిగితే పోలీసులు నింపాదిగా రాత్రి 8.30 గంటలకు వచ్చారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘జిల్లా పాలకవర్గం విఫలమైంది. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా వచ్చి మా డిమాండ్లు వినాలి’ అని కాల్పుల ఘటన జరిగిన గ్రామం సర్పంచ్ ధీరజ్ శర్మ డిమాండ్ చేశారు. స్థానికులు పూనుకోకపోతే ఆ ఉగ్రవాదులు మొత్తం 10 మందిని చంపేసేవారే. వారు అంతా అయిపోయాక ఆసుపత్రికి వచ్చి చూశారు. సివిలియన్స్ ఎంత క్రియాశీలకంగా ఉన్నారో చూశారు. అన్ని నిఘా, రక్షణ సంస్థలు తమ విధుల్లో విఫలం అయ్యాయి’ అని ధీరజ్ శర్మ వివరించారు.

‘ఉగ్రవాదులు ముందు ఆధార్ కార్డు చెక్ చేశారు. తాము హిందువుల ఇళ్లను లక్షం చేసుకుంటున్నామని తెలిపారు. హిందువులు ఆ ప్రాంతం వదిలిపోయేలా వారు లక్షం చేసుకున్నారు. తుపాకులు ఇచ్చి ‘విలేజ్ డిఫెన్స్ కమిటీ’లను బలోపేతం చేయాలని కేంద్రాన్ని, లెఫ్టినెంట్ జనరల్‌ను కోరుకుంటున్నాం. తుపాకులు ఇస్తే కనీసం ఆత్మ రక్షణ అయినా చేసుకోను వీలుంటుంది. బలగాలు వచ్చేలోగా గ్రామంలో అంతా చనిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హిందువులను లక్షం చేసుకుంటున్నారు’ అని రంజీత్ తారా అనే స్థానికుడు చెప్పాడు. తగిన చర్య తీసుకోనంత వరకు నిరసనను ఆపి కదిలేదే లేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే ధన్‌గ్రి గ్రామంలో పోలీసు బలగాన్ని పెంచారు. శోధనలు మొదలెట్టారు.

Local Man Ranjit

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News