Thursday, December 19, 2024

పుల్వామాలో ఉగ్రదాడి.. వ్యక్తిపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో ఉగ్రమూకలు చేసిన దాడిలో ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. మృతుడిని సంజయ్ పండిత్‌గా గుర్తించారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. సంజయ్ తన భార్యతో కలిసి మార్కెట్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు కావాలనే సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News