Saturday, December 21, 2024

దోపిడి దొంగల దాడి.. ఎస్‌ఓటి కానిస్టేబుల్ ఆరోగ్యం విషమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దోపిడి దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఓటి కానిస్టేబుల్ రాజు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిషోర్‌రెడ్డిని హత్య చేసిన దోపిడి దొంగను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్‌ఓటి కానిస్టేబుల్ రాజు, వినయ్‌పై నిందితుడు కరణ్‌సింగ్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయపడిన కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇందులో రాజు పరిస్థితి విషమంగా ఉండగా, వినయ్ కోలుకుంటున్నట్ల్లు తెలిసింది. నార్సింగిలో దంపతులపై దాడి చేసి దారిదోపిడీ చేసిన విషయం తెలిసిందే.

కానిస్టేబుళ్లకు… సిపి పరామర్శ…

దారిదోపిడి దొంగల చేతిలో గాయపడిన ఇద్దరు ఎస్‌ఓటి కానిస్టేబుళ్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర పరామర్శించారు. కానిస్టేబుళ్లు చికిత్స పొందుతున్న మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

నార్సింగి పిఎస్ ఎదుట ఉద్రిక్తత…

దారిదోపిడి కేసులో నిందితుడిగా ఉన్న కరణ్ సింగ్ బంధువులను నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు యత్నించారు. తమను ఎందుకు విచారణకు తీసుకుని వస్తారని ఇన్స్‌స్పెక్టర్ శివకుమార్‌పై దాడి చేసేందుకు యత్నించారు. సిక్కు బస్తీకి చెందిన కరణ్ సింగ్ ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేయడంతో అనుమానితులను పోలీసులు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడి బంధువులను కూడా విచారణ కోసం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News