- Advertisement -
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : పేకాట స్థావరంపై గొల్కొండ పోలీసులు దాడి చేసి పేకాడుతున్న పదిమందిని సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.72,380 నగదు, ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….కొందరు వ్యక్తులు కలిసి టోలీచౌకిలోని హకీంపేట, డెక్కన్ ప్లాజాలో పేకాడుతున్నారని సమాచారం రావడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎండి సలీం, మసూద్ ఖాన్, సయిద్ మసూద్, సయిద్ జమాల్‌అలీ, షేక్ జాఫర్, భాస్కర్, అర్షద్ మోయినుద్దిన్ ఖాద్రీ, ఎండి ముస్తాక్, ధోరా స్వామి, సయిద్ కరీంను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సై ఎండి ముజఫర్‌అలీ, మల్లికార్జున్, రంజిత్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.
- Advertisement -