Wednesday, January 22, 2025

ఒయులో అక్రమ కట్టడాలు… అడ్డుకున్న ఎబివిపి కార్యకర్తలపై దాడి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1లోని కాకతీయ కాలనీలో యూనివర్సిటీ స్థలంలో రాత్రిపూట అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలని అడ్డుకోవడానికి వెళ్లిన ఎబివిపి కార్యకర్తలపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు ఎబివిపి కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ సి రెండవ సంత్సరం చదువుతున్న ఎబివిపి కార్యకర్త వికాస్ తీవ్రంగా గాయపడడడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

వికాస్ పరిస్తితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు యూనివర్సిటీ అధికారులపై నిప్పులు విసిరారు. యూనివర్సిటీ సెక్యూరిటీ, యూనివర్సిటీ విసి, రిజిస్టర్ విలువైన యూనివర్సిటీ స్థలాలను ఆక్రమించుకొని పోతుంటే చ్యోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు యూనివర్సిటీ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని వారు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News