- Advertisement -
ఎంపి అసద్‌పై యూపిలో దాడి
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీస్ అధికారుల ఆదేశం
హైదరాబాద్: ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసిపై ఉత్తర ప్రదేశ్‌లో దాడి జరగడంతో నగర పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తన వాహనంపై ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లా, కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో అసుదుద్దీన్ పాల్గొన్నారు. ప్రచారం అనంతరం ఢిల్లీకి వెళ్తుండగా ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు 3 నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎంపి కావడంతో నగరంలోని సున్నిత ప్రాంతాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి సమయంలో పోలీస్ భద్రతను మరింత పెంచారు. నగరంలోని ఎంఐఎం కార్యకర్తలు ధర్నాలు, నిరసన చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
- Advertisement -