Monday, December 23, 2024

అల్లు అర్జున్ ఇంటిపై దాడి

- Advertisement -
- Advertisement -

పూల కుండీలను పగులగొట్టిన విద్యార్థులు
బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని
నినాదాలు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : పుష్ప2 హీరో అల్లు అర్జున్ ఇం టిపై ఓయూ జేఏసి పేరుతో నాయకులు ఆదివారం దాడి చేయడం తో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన ఆరుగురు జేఏసి నాయకులు ఇంట్లోకి చొ చ్చుకుని వెళ్లి పూల కుండీలు పగులగొట్టారు, ఇంటిపైకి రాళ్లను వి సిరారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసి నాయకులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు.

ఓ యూ జేఏసి నాయకులు దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనల నేపథ్యం లో పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశా రు. సంఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు, దాడి సమాచారం తెలుసుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికి వచ్చి సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురు ఓయూ జేఏసి నాయకులు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

అప్రమత్తంగా ఉండండి : అల్లు అర్జున్

సోషల్ మీడియాలో పోస్టింగులకు అభిమానులు దూరంగా ఉండని అల్లు అర్జున్ సూచించారు. తొక్కిసలాటపై ఎలాంటి నెగెటివ్ పోస్టింగ్‌లు పెట్టవద్దని కోరారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే వి ధంగా పోస్టులు పెట్టవద్దని విజక్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గ త కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ప్రొఫైల్స్‌తో పోస్టులు పెడుతున్న వా రిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెగెటివ్ పోస్టు లు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులకు సూచించా రు. కొందరు ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని వి మర్శించినట్లు తన దృష్టికి రావడంతో అల్లు అర్జున్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News