Sunday, December 22, 2024

ఆమన‌గల్ ఎంపిపి దంపతులపై దాడి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆమన‌గల్ మండలం మేడిగడ్డ తాండలో బుధవారం ఆమనగల్లు ఎంపీపీ నేనావత్ అనిత విజయ్ దంపతులపై తాండాకు చెందిన నేనావత్ రవీందర్‌నాయక్ దాడి చేసిన గాయపరిచినట్లు ఆమనగల్లు ఎసై బలరాంనాయక్ తెలిపారు. ఎసై తెలిపిన వివరాల ప్రకారం… తాండ సమీపంలోని మౌటెన్‌వ్యూ అనే వెంచర్‌కు అనుమతులు ఉన్నాయా లేవా అని ఎంపీవో శ్రీలత, పంచాయితీ కార్యదర్శి వెంకటయ్యలతో కలిసి ఎంపీపీ అనిత, భర్త విజయ్‌నాయక్‌లు వెంచర్ వద్దకు వెళ్లారు.

అదే సమయంలో వెంచర్‌లో పనిచేస్తున్న నేనావత్ రవీందర్‌నాయక్ ఎటువంటి కారణం లేకుండా ఎంపీపీనైన తనను బూతులు తిడుతూ, కోడుతూ తన చీర, జాకెట్‌ను చింపివేశాడని, తన భర్త విజయ్ అడ్డుకుంటుండగా అక్కడే ఉన్న బండరాయిని తీసుకోని అతని తలపై బలంగా కోట్టడంతో తీవ్ర గాయాలైనట్లు ఎసై తెలిపారు. మహిళనైన తనను అవమానపరిచిన, భర్తను కోట్టిన రవీందర్‌నాయక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు ఎసై తెలిపారు. ఈ దాడిపై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై బలరాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News