Tuesday, November 5, 2024

శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి

- Advertisement -
- Advertisement -

గోవింద నామస్మరణ చేయడంపై భద్రతా సిబ్బంది అభ్యంతరం

తిరుచిరాపల్లి: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్య భక్తులపై గుడికి చెందిన భద్రతా సిబ్బంది దాడి చేశారు. కేరళలోని శబరిమల ఆలయ దర్శనానికి పయనమైన భక్తులు ముందుగా తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటుంటారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరుఅయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. గర్భగుడి సమీపంలో వారు బిగ్గరగా గోవింద నామ స్మరణ చేయడంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఆలయ భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలిపారు.

వేంకటేశ్వర స్వామివారికి సంబంధించిన భగవన్నామ స్మరణ ఇక్కడ చేయరాదంటూ వారు అడ్డుకున్నారు. దీంతో అయ్యప్ప భక్తులకు, భద్రతా సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరుపక్షాల మధ్య అది గోపులాటకు దారితీసింది. భద్రతా సిబ్బంది దాడిలో అయ్యప్ప భక్తులు కొదరికి గాయాలయ్యాయి. రక్తసిక్త గాయాలతో ఒక భక్తుడు గుడిలోపల నేలమీదే కూలబడిపోయాడు. ఈ ఘటనను తిలకించిన మరి కొందరు అయ్యప్ప భక్తులు ఆంధ్రా భక్తులకు మద్దతుగా నిలబడ్డారు.

దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరుపక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు పక్షాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా&ఈ ఘటన గురించి తెలుసుకున్న తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై తమిళనాడు ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖపై అగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అహంకారపూరిత వైఖరికి నిరసనగా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం వెలుపల తమ పార్టీ తిరుచి జిల్లా శాఖ ప్రదర్శన నిర్వహిస్తుందని ప్రకటించారు. ఆలయ పవిత్రతతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News