Sunday, December 22, 2024

ఆర్‌టిసి డ్రైవర్‌పై దాడి… ఏడుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

అమరావతి: నెల్లూరు జిల్లాలో ఈ నెల 26న ఎపిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్‌పై కొందరు దాడి చేశారని ఎస్‌పి తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. కావలి సమీపంలో ఆర్‌టిసి డ్రైవర్ రామ్‌సింగ్‌పై కొందరు దాడి చేశారని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై బస్సును ఓవర్‌టేక్ చేసి డ్రైవర్‌పై దాడి చేశారని, దాడి చేసినవారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్‌పి వెల్లడించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని, ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశామని తిరుమలేశ్వర్ వివరించారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుదీర్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, దేవరకొండ సుధీర్‌ను అతి త్వరంలో పట్టుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News