Sunday, December 22, 2024

ఆర్మీ అధికారులపై దాడి… స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భోపాల్: ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి చేసి అనంతరం వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో ఇద్దరు యువ ఆర్మీ అధికారులు శిక్షణలో ఉన్నారు. ఇద్దరు ఆర్మీ అధికారులు తన స్నేహితురాళ్లతో కలిసి జాలిగా గడిపేందుకు పిక్నిక్‌కు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి చేసి అనంతరం వారి వద్ద డబ్బు, నగలను దోచుకున్నారు. ఓ స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. వెంటనే ఆర్మీ అధికారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధితురాలను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో నిందితులపై క్రిమినల్ కేసులున్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News