Thursday, December 26, 2024

చెంచు మహిళపై దాడిలో ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళపై అత్యంత పాశవికంగా దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. మధ్యయుగాల నాటి మనస్తత్వంతో మానవత్వాన్ని మరిచి మనుషుల రూపంలో ఉన్న మృగాళ్లు జరిపిన ఈ దాడిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అమ్మాయిలు, మహిళలపై అఘా యిత్యాలకు తెగబడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు తమ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తుందని అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క బుధవారం పరమర్శించారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బాధితురాలికి సీతక్క భరోసానిచ్చారు.

బాధితురాలి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. ఏ అవసరం ఉన్నా తనకు కాల్ చేయాలని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీతక్క కేసు పురోగతిని తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఎస్పీని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీతక్క భాధిత మహిళ ఇప్పుడిప్పుడే కొలుకుంటుందని అన్నారు. దాడి ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఐటీడీఏ, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధితురాలికి అండగా నిలిచారని గుర్తు చేశారు. భాధితురాలని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించినట్లు తెలిపారు. బాధితురాలు పూర్తిగా కోలుకున్నాకే ఇంటికి పంపిస్తామన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని అన్నారు. ఘటనలో పాలు పంచుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నాగరకర్నూల్ ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. బాధితురాలి మామయ్య నాగయ్య మృతి పట్ల అనుమానాలున్నందున ఆ కేసును పునః విచారించాలని ఆదేశించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News