Thursday, December 19, 2024

సికింద్రాబాద్ లో యాచకులపై కత్తులతో దాడి…. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున రెండు చోట్ల యాచకులపై దాడి జరిగింది. రెండు చోట్ల దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పరిధిలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మారేడ్‌పల్లిలో నడిచి వెళ్తున్న యాచకుడిపై కూడా ముగ్గురు దాడి చేశారు. యాచకుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఫుట్‌పాత్‌పై పడుకున్న యాచకులపై దాడి చేసి దుండగులు డబ్బులు లాక్కెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News