Monday, December 23, 2024

నర్సంపేటలో తన్నుకున్నారు..

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నాయకులు గురువారం దాడి చేశారు. పార్టీ ఇంచార్జీ, మాజీ ఎంపి జితేందర్ రెడ్డితో వాగ్వాదానికి దిగి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు బాల్నె జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లో ఈనెల 8న ప్రధాన మంత్రి మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకులుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎంపి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా నర్సంపేట నియోజకవర్గ బిజెపి నేత డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు సుమారు 25మంది కార్యాలయంలోకి వచ్చారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తున్నామని తమకు పార్టీ పరంగా జరిగే సమావేశానికి సమాచారం ఉండటం లేదని తెలిపారు.

దీంతో మాజీ ఎంపి జితేందర్ రెడ్డి ప్రధాన మంత్రి మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడడానికి ఇది వేదిక కాదని ఆర్‌అండ్ బి అతిథి గృహానికి రావాలని సూచించడంతో బిజెపి నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మీకు తెలియదంటూ అసభ్యకరంగా మాట్లాడటంతో చేసేది ఏమీ లేక జితేందర్ రెడ్డి సమావేశాన్ని రద్దు చేసుకొని వెళ్లి పోయారు. దీంతో ఆగ్రహించిన బిజెపి నాయకులు కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ మేరకు తమ పార్టీ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి మాజీ ఎంపి జితేందర్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలను అసభ్యకరంగా మాట్లాడి కార్యాలయంపై దాడి చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News