Wednesday, January 22, 2025

బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై దాడి

- Advertisement -
- Advertisement -

వెంగళరావు నగర్ కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ నేత దేదీప్యపై దాడి జరిగింది. మంగళవారం రాత్రి దేదీప్య కారులో వెళ్తుండగా కొందరు మహిళలు అడ్డుకుని ఆమెపై దాడికి దిగారు. ఈ సంఘటనలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయమై తన భర్త విజయ్ తో కలసి వెళ్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే తనపై దాడి జరిగిందని దేదీప్య ఆరోపించారు. ఫ్లెక్సీల వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News