Monday, December 23, 2024

నగదు అడిగినందుకు బంకు సిబ్బందిపై దాడి.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : డిజిటల్ పేమెంట్ లేదని నగదు ఇవ్వాలని పెట్రోల్ బంక్ సిబ్బంది కోరడంతో సహనం కోల్పోయిన యువకులు సిబ్బంది పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. యువ‌కుల దాడిలో పెట్రోల్ బంక్‌కు చెందిన కార్మికుడు మృతి చెందాడు. కారులో పెట్రోల్ పోయించుకుని, పేమెంట్ కోసం యువ‌కులు కార్డు ఇచ్చారు. స్వైపింగ్ యంత్రం లేదు.. డ‌బ్బు ఇవ్వాల‌ని సిబ్బంది అడ‌గ‌డంతో.. యువ‌కులు రెచ్చిపోయారు.

బంక్‌లో ఉన్న ఇద్ద‌రు కార్మికుల‌పై ముగ్గురు యువ‌కులు దాడి చేశారు. త‌ల‌పై బ‌లంగా కొట్ట‌డంతో సంజ‌య్ అనే కార్మికుడు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. యువ‌కుల దాడిలో సంజ‌య్ మృతి చెందాడు. మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. పెట్రోల్ బంక్ యాజ‌మాన్యం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న నార్సింగి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ ముగ్గురిని జ‌న్వాడ‌కు చెందిన న‌రేంద‌ర్, మ‌ల్లేశ్‌, అనూప్‌గా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News