Saturday, April 5, 2025

కలెక్టర్‌పై దాడి కేసు..19 మందికి అసలు భూమే లేదు

- Advertisement -
- Advertisement -

లగచర్ల ఘటనలో ఎ1గా మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి ఉన్నారని వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజి సత్యనారాయణ తెలిపారు. లగచర్ల ఘటనలో మొదట 47 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో 16 మందిని రిమాండ్‌కు తరలించామన్నారు. బుధవారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మిగతా వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ‘అధికారులను తప్పుదోవ పట్టించిన సురేశ్‌పై గతంలో కేసులున్నాయి. ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదు. కొందరికి భూమి ఉన్నా.. భూసేకరణ పరిధిలోకి రాదు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. నిందితులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించాం. చాలా మంది రైతులను విచారించి వదిలిపెట్టా’మని ఐజి సత్యనారాయణ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News