Wednesday, January 22, 2025

పాక్ బలూచిస్థాన్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాయపడిన మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. చైనా నిర్మాణ సంస్థలో పనిచేస్తోన్న ఇంజినీర్ల కాన్వాయ్‌ను గ్వాదర్ లోని ఫకీర్ వంతెనపై బలూచిస్థాన్ తిరుగుబాటు దారులు అడ్డుకుని దాడి చేశారు.

Also Read: గ్రూప్-2 వాయిదాపై టిఎస్‌పిఎస్‌సి వెబ్ నోట్ ఇవ్వలేదు: బల్మూరి వెంకట్

ఈ సమాచారం తెలిసిన వెంటనే పాకిస్థాన్ భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ రహదారిని బ్లాక్ చేశాయి. పరస్పర కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. గాయపడిన మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. పాకిస్థాన్ భద్రతా సిబ్బంది కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ దాడి తమదేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ ) ప్రకటించింది. గతంలో కూడా చైనా జాతీయుల లక్షంగా పలు దాడులకు బీఎల్‌ప పాల్పడింది. ఈ సంఘటన నేపథ్యంలో బలూచిస్థాన్ లోని తమ పౌరులు ఇళ్ల లోనే ఉండాలని చైనా సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News