Wednesday, January 22, 2025

పెళ్లి విందులో దళిత యువకుడిపై దాడి

- Advertisement -
- Advertisement -

 

గోండ: ఒక వివాహ విందులో భోజనం చేయబోయిన ఒక దళిత యువకుడిపై దాడి జరిగిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండ జిల్లా వజీర్‌గంజ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. 18 ఏళ్ల లల్లా అనే దళిత యువకుడిని దుర్భాషలాడి అతడిని దారుణంగా కొటిన వారిపై ఎస్ సి, ఎస్ టి చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గ్రామంలోని సందీప్ పాండే అనే వ్యక్తి ఇంట్లో జరిగిన పెళ్లి విందులో పాల్గొనేందుకు తన సోదరుడు లల్లా వెళ్లాడని అతని సోదరి రేణు తెలిపింది.

భోజనం చేసేందుకు ప్లేటు తీసుకున్న లల్లాను పెళ్లి ఇంటికి చెందిన సందీప్, అతని సోదరులు దుర్భాషలాడడమేకాక తీవ్రంగా కొట్టారని ఆమె తెలిపింది. అడ్డుపడేందుకు ప్రయత్నించిన లల్లా అన్న సత్యపాల్‌పై కూడా నిందితులు దాడి చేసి అతని బైక్ ధ్వంసం చేసినట్లు ఆమె చెప్పారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్‌తోపాటు పెద్దలకు తాము ఫిర్యాదు చేయగా ఈ విషయం తెలుసుకున్న సందీప్, అతని సోదరులు తమ ఇంటికి వచ్చి లల్లాపై మరోసారి చేయిచేసుకోవడంతోపాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని ఆమె చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News