Wednesday, November 6, 2024

డెన్మార్క్ ప్రధానిపై దాడి

- Advertisement -
- Advertisement -

కోపెన్‌హాగెన్ : ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటి ఫ్రెడ్రిక్సన్‌పై దాడి జరిగింది. ఏకంగా ప్రధాని పైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో ఒక దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. “ కోపెన్‌హాగెన్ లోని కల్టోర్‌వెట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీ లోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారు. ” అని ఫ్రెడ్రిక్షన్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాంతో భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈఘటనపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొద్ది వారాల క్రితం స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోపై ఒక దుండగుడు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News