Monday, December 23, 2024

స్వాతి మాలివాల్ ఇంటిపై దాడి

- Advertisement -
- Advertisement -

Swati Maliwal residence attacked

న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతిమాలివాల్ ఇంటిపై సోమవారం ఓ వ్యక్తి దాడిచేశాడు. రెండు కార్లు ధ్వంసం చేశాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి బాగాలేదన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుండా పోయిందన్నారు. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ శ్రద్ధ చూపాలన్నారు. ఇదిలావుండగా తన ఇంటిపై దాడికి సంబంధించిన స్వాతి మాలివాల్ ఢిల్లీ పోలీసుకు ఫిర్యాదు చేశారు. గత వారం ఆమె నిర్మాత సాజిద్ ఖాన్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌కు లేఖ రాశారు. అతడిని తొలగించాలని డిమాండ్ చేశారు. మీ టూ మూవ్‌మెంట్‌లో భాగంగా నిర్మాత సాజిద్ ఖాన్ మీద ఆరోపణలు వచ్చాయన్నది ఇక్కడ గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News