- Advertisement -
వరంగల్: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద వైద్యుడిపై రాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. వరంగల్- బట్టుపల్లి ప్రధాన రహదారిలో సిద్ధార్థ రెడ్డి అనే వైద్యుడు తన కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. వైద్యుడుపై రాడ్లు, రాళ్లతో దాడి చేయడంతో కిందపడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న వైద్యుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిద్ధార్థ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -