Wednesday, January 22, 2025

కరెంట్ బిల్లు కట్టమన్నందుకు సిబ్బందిపై దాడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కరెంట్ బిల్లు కట్టనందుకు ఓ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడి చేసిన నిందితుడిని మీర్‌చౌక్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, పురాణా హవేలికి చెందిన మహ్మద్ ఒమర్ అలియాస్ మహ్మద్ ఒమర్ చౌదరీ గత మార్చి నుంచి ఇంటికి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో రూ.9,348 పెండింగ్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టిఎస్ ఎస్‌పిడిసిఎల్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న ఎండి అబ్దుల్ సలీం రాహి ఈ నెల 19వ తేదీన ఇంటి విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశాడు. దీంతో ఒమర్ పోన్ చేసి సలీంను తిట్టాడు.

ఈ క్రమంలోనే ఎఈ జిఎల్‌ఎన్ రాజు, సలీం, షేక్ ఖలీల్‌తోపాటు ఎలక్ట్రిసిటీ సిబ్బందితో కలిసి పూరాణా హవేలి ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ ఒమర్ విద్యుత్ కనెక్షన్‌ను అక్రమంగా పెట్టడం గమనించారు. అదే సమయంలో ఒమర్ వీరు ఉన్న ప్రాంతానికి వచ్చి విద్యుత్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు, అంతేకాకుండా సలీంను నెట్టివేశాడు. చేబులో ఉన్న కత్తి తీసి సలీంపై దాడి చేసేందుకు యత్నించడంతో ఎఈ అడ్డుకున్నాడు. ఈ సంఘటన జరిరగిన తర్వాత సిబ్బంది మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News