Friday, January 10, 2025

ఫుడ్ ఆర్డర్ ఆలస్యం.. డెలివరీ బాయ్ పై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ : తనకు డెలివరీ చేయాల్సిన ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైనందుకు ఓ వ్యక్తి సహనం కోల్పోయి డెలివరీ బాయ్ పై దాడి చేసిన ఘటన హుమయూన్ నగర్ లో చోటుచేసుకుంది. 15 మంది అనుచరులతో వచ్చి హోటల్‌ వద్ద వీరంగం సృష్టించాడు. భయంతో డెలివరీ బాయ్‌ హోటల్‌లోకి పరుగుతీసాడు..

అయినా విడిచిపెట్టకుండా యువకులు హోటల్‌లోకి దూసుకెళ్లి డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ పెనుగులాటలో పక్కనే ఉన్న మరిగే నూనె మీద పడడంతో డెలివరీ బాయ్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News