- Advertisement -
అమరావతి: మాజీ జడ్జి రామకృష్ణ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేడకోడవళ్లతో మాజీ జడ్జి రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. కిటికీలు, కారు అద్దాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. గతంలో ఆయన ఇంటిపై దాడి చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా వైసిపి కార్యకర్తులు చేసి ఉంటారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రామకృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం యాక్షన్ తీసుకోవడం లేదని ఆయన ఆరోపణలు చేశారు.
- Advertisement -