Friday, December 20, 2024

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

- Advertisement -
- Advertisement -

చికాగోలో దారుణ ఘటన

న్యూఢిల్లీ: అమెరికాలోని చికాగోలో నలుగురు సాయుధ దొంగలు చేసిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి తీవ్రం గా గాయపడ్డాడు. రక్తసిక్త గాయాలతో ఉన్న ఆ విద్యార్థి తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన దొంగలు తన ఫోన్‌ను ఎత్తుకెళ్లారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది నలుగురు భారత సంతతికి చెందిన విద్యార్థులు అమెరికాలో విగతజీవులై కనిపించడంతో తాజా ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన సయ్యద్ మజహిర్ అలీ ఇండియానా వెస్టీయన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని తన ఇంటి సమీపంలో ముగ్గురు దుండగులు అలీపై దాడి చేస్తున్నట్లు సిసిటివి దృశ్యాలు చూపాయి.

నోట్లో నుంచి, ముక్కులో నుంచి ధారా పాతంగా రక్తం స్రవిస్తున్న అలీపై నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు వీడియోలో కనిపించింది. చేతిలో ఫుడ్‌ప్యాకెట్‌తో ఇంటికి తిరిగివస్తుండగా తన ఇంటి సమీపంలో తాను కాలుజారి పడ్డానని, తనపై నలుగురు వ్యక్తులు దాడి చేసి కాళ్లతో, చేతులతో చితకబాదారని అతను తెలిపాడు. తనను కాపాడాలంటూ ఆయన ఆర్తనాదాలు చేయడం ఆ వీడియోలో కనిపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News