Monday, December 23, 2024

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు మరోసారి దాడి చేశారు. భారతీయ కాన్సులేట్‌పై శనివారం దాడిచేసి విధ్వంసం సృష్టించారు. గడచిన ఐదు మాసాలలో ఈ తరహా దాడి జరగడం ఇది రెండవసారి.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మ ఈడియాలో దర్శనమిచ్చింది. హింసకు జబావు హింసే అన్న అక్షరాలు వీడియోలో కనిపించాయి. కెనడాకు చెందిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి సంబంధించి వార్తా క్లిప్పింగ్‌లు, అతని ఫోటోలు వీడియోలో కనిపించాయి. ఇండియాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉత్రవాదులలో ఒకడైన నిజ్జర్ తలపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. గత నెలలో కెనడాలోని గురుద్వార వెలుపల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజ్జర్ హతమయ్యాడు.

కాగా..శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్‌పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది నేరపూరిత చర్యగా అమెరికా వర్ణించింది. అమెరికాలోని విదేశీ కార్యాలయాలపైన, విదేశీ దౌత్యవేత్తల పైన ఎటువంటి దాడులు జరిగినా సహించేది లేదని అమెరికా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం ట్వీట్ చేశారు.

శాన్‌ఫ్రోన్సిస్కోలోని ఇండియా కాన్లుట్‌లో ఆదివారం తెల్లవారుజామున 1.30, 2.30 గంటల మధ్యలో మంటలు చెలరేగాయని, మంటలను అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆర్పివేశారని, ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అమెరికాలోని దక్షిణాసియా టివి ప్రసార వ్యవస్థ దియా టివి తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా టివి ప్రసారం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News