Monday, November 18, 2024

జర్నలిస్ట్‌పై మాజీ మేయర్ అనుచరుల దాడి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కవరేజ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్‌పై బిజేపి కార్యకర్తలు దాడి చేసిన సంఘటన తార్నాకలో ఆదివారం చోటుచేసుకుంది. మాజీ నగర మేయర్ బండ కార్తీక తార్నకలోని బిజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడకలను కవర్ చేసేందుకు జర్నలిస్టు దాసు గణేష్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న బిజేపి కార్యకర్తలను వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టు దాసు గణేష్ పక్కకు జరగాల్సిందిగా కోరాడు. దానికి వారు జర్నలిస్టులో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా దాడి చేశారు. ఈ తతంగం జరుగుతున్న సమయంలో మాజీ మేయర్ బండ కార్తీక, ఆమె భర్త అక్కడే ఉన్నా కూడా ఆపలేదు. అంతేకాకుండా జర్నలిస్టునే బెదిరించారు. దీంతో బాధితుడు ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Attack on Journalist in Tarnaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News