భావ ప్రకటనా స్వేచ్ఛ పైన నియంత్రణలు, దాడులు సమాజంలో ఎప్పుడూ ఉన్నప్ప టికీ, కలాలకు, గళాలకు సంకెళ్లువేయడం సాధ్యం కాదని చరిత్ర ఎప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఏ సమాజం అన్న పురోగమించాలి అంటే నూతన ఆవిష్కరణలు జరగాలి. విభిన్న భావాల వ్యక్తీకరణ, వాటి మధ్య సంవా దన, సంఘర్షణ జరగాలి. అది మార్పు కు దారితీస్తుంది. నిజానికి సమాజ హితానికి తోడ్పడే, మనుషుల మధ్య అంతరాలు, వివక్షతలు లేని మంచి స మాజం రూపుదిద్దుకునే క్రమం ఇలానే కొనసాగాలి. సమాజంలో, మను షుల ఆలోచనలు, ఆచరణ పైన భావజాలం చూ పించే ప్రభావం చిన్నది కాదు.
ఎటువంటి సాంఘి క, ఆర్థిక పరిస్థితుల మధ్య, ఏ అస్తిత్వాల అణచి వేతల మధ్య మనం జీవించాల్సి వస్తూ ఉందో, ఆ స్థితి మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనల కి, జీవన వాస్తవికతలకి మధ్య అవినా భావ సంబంధం ఉంటుంది. మంచి సమా జం కావాలని కోరుకున్నప్పుడు మనం ఆలోచించే పద్ధతుల్లోనే కాదు జీవించే పద్ధతుల్లో కూడా ఎంతో మార్పు రావాల్సి ఉంటుంది. అప్పటికే ఉనికిలో ఉన్న సమాజం వల్ల, భావజాలం వల్ల లాభపడే వాళ్ళు కొత్తని ఆహ్వానించడానికి నిరాకరిస్తారు. ఈ నూతనత్వం తమ ప్రయోజ నాలకు వ్యతిరేక మైనది అనుకున్నప్పుడు, అ లాంటి భావాలను అణి చివేసేందుకు, అలాం టి భావాలు కలిగి ఉన్న మనుషులపైన దాడి చేసేందుకు, భౌతికంగా నిర్మూలిం చేందుకు కూడా వెనుకాడరు. ప్రజాస్వామిక విలువలను విశ్వసించే వారు ఎవరైనా తమ అభి ప్రాయాలకు భిన్నం ఇతరులు ఎవరైనా అభిప్రా యాలను కలిగివున్నా, వ్యక్తం చేసినా, ఆ అభిప్రా యాలను ఖండించవచ్చు. చర్చను చేయడానికి పూనుకోవాలి తప్ప భౌతిక, మూక దాడులకు, దుష్ప్రచారాలకు, వ్యక్తిత్వ హననాలకు, ట్రోలింగ్‌కు పూనుకోవడం చేయకూడదు. ఇంతటి సంయ మనం మన సమాజంలో ఎక్కడా మిగిలి లేదు.
ఇ ప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం, అ న్ని రంగాలలో చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో కొన సాగుతూ ఉంది. కవులు, కళాకారులు, చిత్రకారు లు, నాటక, సినీ రంగాలలో గల సృజన శీలురు, మేధావులు, చరిత్రకారులు, మీడియా, పత్రికా విలే కరులు, సామాజిక కార్యకర్తలు వీరు వారు అనే తేడా లేకుండా ప్రగతిశీల ఆలోచనలు కల ప్రతి ఒక్కరి పైన దేశవ్యాప్తంగా అసహనపు దాడులు జరుగుతున్నాయి. మహిళల పైన మరింత అసభ్య కరమైన రీతిలో ట్రోలోంగ్స్ జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తరహా, భౌతికంగా నిర్మూలించడాలను విడివిడి ఘటనలుగా చూసిన ప్పుడు దాని తీవ్రతను అర్థం చేసుకోవడంలో సమా జం విఫలమవుతుంది. భిన్నాభిప్రాయాలకు, అస మ్మతికి, ప్రజాస్వామ్యానికి తావు లేకుండా చేయ డం నియంతృత్వ పోకడ తప్ప మరొకటి కాదు. తె లుగు సమాజం మొదటి నుంచి భావ సంఘర్షణ లు, ప్రజాస్వామిక విలువల నుండి ఎదిగింది. భిన్నత్వాన్ని గౌరవించగలిగిన కలిసి జీవించగలిగిన తెలుగు సమాజం ఇది.
మొన్నటికి మొన్న మేధా వి, సామాజిక కార్యకర్త వీక్షణం వేణు గోపాల్ పైన, కవయిత్రి, మెర్సీ మార్గరెట్ పైన ఉన్మాద పూ రిత అసహన, మత విద్వేషకు దాడులు, బెదిరిం పులు జరిగాయి. గతంలో భిన్నమైన అభిప్రాయా న్ని కలిగి ఉన్నారు అనే నెపంతో అనేకమంది మీద ఎటువంటి మూకదాడులే ప్రత్యక్షంగాను, ఇతర మాధ్యమాల ద్వారాను జరిగాయి. “విశాలమైన భా రతదేశం భిన్న జాతులకు సంస్కృతులకు, భాషలకు, జీవన విధానాల కు నిలయం. ఈ బహుళత్వానికి తావు లేకుండా చేసేందుకు, జరుగుతున్న ప్రయ త్నాలను, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువ లు, భావ ప్రకటనపై దాడుల పట్ల అనేక మంది రచయితలు తమ ఆందోళనలను, నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రా యాలను మెహఫిల్ మీకు అందిస్తున్నది.”
విమల
విచక్షణ కోల్పోయిన అసహనం ఏదైనా ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. స్వేచ్ఛగా భావాల సంఘర్షణకి తావులేని చోట ఫాసిజానికి రహదారి ఏర్పడుతుంది. ఏమి మాట్లాడారో, ఏమి రాశారో, ఏమి జరుగుతుందో కూడా చూడకుండా వ్యక్తి కేంద్రంగానో , సంస్థ కేంద్రంగానో దాడులు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ ప్రైవేట్ హింసలో మతోన్మాద శక్తుల అరాచక ప్రవర్తన ‘హద్దు’ మీరుతోంది. మొన్న కాకతీయ యూనివర్సిటీలో సమూహ సమావేశంపై దాడి నుంచి , నిన్న బుక్ ఫెయిర్ లో బుక్ షాప్స్ లో పెట్టిన కొన్ని పుస్తకాలపైన జరిగిన దాడి మనందరికీ ఒక హెచ్చరిక. ఏమి మాట్లాడకూడదో, ఏమి రాయకూడదో, ఏమి ముద్రణ కాకూడదో ఈ మూకలు రచయితలను, మేధావులను , పబ్లిషర్స్ ను బెదిరిస్తున్నాయి. ఈ మతోన్మాద ఫాసిస్ట్ వైఖరులపట్ల సమాజం అప్రమత్తంగా వుండాలి. మనం ఐక్యం గా ఈ ధోరణులను నిగ్గదీసి ప్రశ్నించాలి; అందుకుతగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి.
ఆర్‌కె (పర్‌స్పెక్టివ్స్)
ఇది చాలదేమో
డొల్లగా మారిన పవిత్ర ప్రతీకలను హేళన చేయడం కొత్తదేమీ కాదు. దేవుణ్ణయినా సరే తన ప్రకటిత శక్తిని నిరూపించుకోలేక పోతే భక్తులు అపచారాలకు కూడా తెగించి, కడిగి పారేస్తారు. తార్కిక శక్తిని, కుతూహలాన్ని పెంచే రచనలను చేయడం కానీ, వాటిని పాఠకుల చేతికి అం దించడం కానీ ఇవాళ మొదలయినది కాదు. భా రతీయ సమాజాలలో, ముఖ్యంగా తెలుగు సమాజాలలో ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మాన వ ప్రయత్నాల వల్ల, కనీసం భావ రంగంలో, ప్రశ్నకు కొంత వెసులుబాటు, కొంత పోషణ ఉంటూ వచ్చాయి. చెరబండరాజు ‘వందేమాత రం’, రంగనాయకమ్మ ‘రామాయణ విషవృక్షం’ ఏభై ఏండ్ల కిందటివి. ముద్దు కృష్ణ నాటకం ‘ అశోకం’ నూరేళ్లకు దగ్గర పడుతోంది. త్రిపురనేని రామస్వామి ‘శంభూక వధ’ రాసి శతాబ్దం గడిచే పోయింది. కవిత సంకలనం సంపాదకురాలిగా మెర్సీ మార్గరెట్, వీక్షణం స్టా ్ నిర్వాహకుడిగా ఎన్. వేణుగోపాల్ ఈ మధ్య ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న దాడులు, వేధింపులు దుర్మార్గమైనవి. ఇవి కొత్త ప్రమాదాన్ని తెస్తున్న దాడులు కా వు, పాత సంస్కారాన్నికూడా తుడిచిపెడుతున్న దాడులు. నిర్మించుకున్న విలువలను కూ ల్చేస్తు న్న గొడ్డలి దెబ్బలు. ఒక్క అడుగూ ముం దుకు పడే వీలు లేకుండా, తిరోగమనానికి తరుముతున్న పాపిష్టి ఫాసిస్టు ఉప్పెన ఇది! ఎదిరిస్తు న్నాం, హాహా కారాలు పెడుతున్నాం, ప్రతిజ్ఞలు చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ, ఇది చాలదేమో, మన భాషకు కొత్త తర్కం, మన తర్కానికి కొత్త భాష కావాలేమో?
కె.శ్రీనివాస్
మన దేశంలో ఫాసిస్టు భావజాలం పెరిగిపోతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి జరుగుతూ ఉంది. ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శన లో మెర్సి మార్గరేట్ , వివిధ కవులు రాసిన కవిత్వాన్ని ఉచ్చల జలధితరంగ అనే పేరుతో ఆవిష్కరణ చేశారు. చాలా దుర్మార్గమైన దాడి ఆమె పైన జరిగింది. అలాగే వీక్షణం వేణుగోపాల్ పైన కూడా తమకు నచ్చని పుస్తకం అమ్ముతున్నాడు అనే పేరుతో దాడి జరిగింది. ఒక రచన ఎవరికన్నా నచ్చకపోవచ్చు. ఒక పుస్తకం పైన, దాని శీర్షిక పైన భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా ఉండవచ్చు. అలా ఉన్నవాళ్లు తమ అ భిప్రాయాలను వ్రాయాలి. చర్చించాలి. అంతే కా నీ తమకు ఆ రచన నచ్చలేదు కాబట్టి దుర్భాషలాడటం, భౌతిక దాడులు చేస్తామనడం ఎంత మా త్రం సరి అయింది కాదు. భిన్నాభిప్రాయాలు స హించలేని అసహనం, ఫాసిజం ప్రపంచమంత టా కూడా చాలా పెరిగిపోయింది.ఇలాంటి చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
కె.శివారెడ్డి
గురజాడ వ్యాఖ్యని తలకితదులు చేస్తూ మనుషుల్ని వదిలేసి మట్టిని ప్రేమించే వారి శాతం పెరుగుతోంది. ఎవరికెవరు శత్రువులు? అందరిదీ ఒకే దేశం. అందరికీ భారతీయ పౌరసత్వమే వుంది. భారతీయులందరూ నా సహోదరులు అని చదువుకున్నవాళ్ళమే. కులమత వర్గ, వర్ణ వివక్ష లేకుండా ప్రాధమిక, మానవ హక్కులు వర్తిస్తాయని, మనది లౌకిక రాజ్యమని గర్వ పడినవాళ్ళమే. ఎవరి రాజకీయ విశ్వాసాలు వాళ్ళకి వుండచ్చు. అయితే ఆ విశ్వాసం లబ్ది దారుల్ని తయారుచేయడమే విచిత్రం. హిందువులకి ముక్కోటి దేవతలున్నారు. అంతమందికీ గుళ్ళు, కళ్యాణాలు , క్షీరాభిషేకాలు చేస్తున్నాం కదా , మెజారిటీ చోటుని, వనరుల్ని ఆవహించి వున్నాం కదా , ప్రభుత్వం కూడా పాలన కంటే శ్రద్ధగా, ఇవే జరిపిస్తాయి కదా . మరి పక్కగల్లీలో అల్లా ని నమ్మే మనుషులపట్ల శతృత్వం ఎందుకు? ఏసుప్రభువుకి మనకీ వున్న కొట్లాట ఏమిటి? ఇది మనం చదువుకున్న రాజ్యాంగానికి, విశాల భావనకి విరుద్ధంగా అనిపిస్తోందని ఎవరేనా రాస్తే ఆకస్మికంగా శత్రువులె లా అవుతున్నారు?
కొండేపూడి నిర్మల
కవయిత్రి మెర్సీ మార్గరెట్‌పై జరుగుతున్న దాడి అతి హేయమైనది. ఆమె చేసిన తప్పు దళితునిమొహంపై మూత్ర విసర్జన చేసిన ఘటనపై తోటి కవులని కలుపుకొని ఒక పుస్తకం తీసుకొని రావ డం, దానికి సంపాదకురాలిగా భాధ్యత వహించడం. ఇది వరకంతా నిస్సహాయ ప్రజల కోసం నిలబడడం దేశభక్తి అయితే,ఇప్పుడలా నిలబడే వారిని వేధించడం దేశ భక్తి అయిపోవడం ఆందోళనకరం. చిహ్నాలే దేశభక్తి అయితే ఈ జాతీయ జెండా నీ నిన్న మొన్నటి దాకా ఎగుర వేయమని మోరాయించుకు కూర్చున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళే ఈ నాటి తీర్పరులుగా మారి ప్రజల పక్షాన నిలబడిన వారిని అన్ని రకాలుగా బోనెక్కించడం, సృజనాత్మక రంగమైన సాహిత్య రంగంలోకి జొరబడి దాడులకు పూనుకోవడం దేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక తిరోగమనాన్ని సూచిస్తుంది. రచయిత్రిని కులంతోనూ, జెండర్‌తోను దూషించడం మరింత భాదాకరం. ఈ సందర్భాన్ని ధైర్యంగా ఎదుర్కొకున్న మెర్సీ మార్గరెట్ కి అభినందనలు. ఆమె కూ,పుస్తకానికి బాసటగా నిలవడం అత్యవసరం.
కత్తి పద్మ
సాంస్కృతిక పోలీసుల వీరవిహార కాలం ఇది. సంస్కృతి మూలం సహనం అన్న సర్వేపల్లి రాధాకృష్ణ ను ఎక్కడో వదిలేసి, ఒకే మతం- అంటే ఒకే అభిప్రాయం, ఒకే దృక్పథం అని భీష్మించి భిన్నత్వంలో ఏకత్వం అనే ఆదర్శాన్ని చరిత్ర నుండి ఉపాంతీకరిస్తున్న అప్రజాస్వామిక సంస్కృతి నేపథ్యంలో చూడాలి మెర్సీ మార్గరెట్ పై నా ఎన్.వేణుగోపాల్ పైనా జరుగుతున్న ట్రోలిం గ్‌ని. ‘ఉఛ్ఛల జలధితరంగ అనే పద బంధం’ ఒక్క జాతీయ గీతంలోనే లేదు. పదాలను అర్ధవంతంగా కూర్చుకొనటంలోనే భాషాసాహిత్య వ్యక్తీకరణల సౌందర్యం విస్తృతం అవుతుంటుంది. దళితుడి మీద ఉచ్చపోసిన అగ్రవర్ణ అహంకారంపై సంధించిన వ్యంగ్యం ‘ఉచ్చల’ పదప్రయోగం. పదానికి ఉండే పలు సందర్భాల పలు పదాల సంయోగ ప్రయోగ వైచిత్రి గురించిన కనీస జ్ఞానం లేని వాళ్ళు ‘ఉచ్చల జలధితరంగా’ అని శీర్షిక పెట్టటాన్ని దేశ ద్రోహం అంటున్నారు. దళితులను లోకువ చేసే వర్ణాలు, వర్గాలు లేని దేశా న్ని గురించిన ఆకాంక్ష ఆ ఆగ్రహంలో ఉన్నాయి, ఆ నిరసనలో ఉన్నాయి. అలాగే వేణుగోపాల్ విషయంలో లో తిరుపతి భౌద్ధక్షేత్రం అని నిరూపించే పరిశోధన గ్రంధం పుస్తక ప్రదర్శనలో తన స్టాల్ లో అమ్మటం దాడికి నెపం అయింది.
ఆ పుస్తకం అమ్మటాన్ని ప్రశ్నిస్తున్నారంటే పుస్తకం అమ్మటాన్నే కాదు శాస్త్ర పరిశోధనలను, ఫలితాల ప్రచురణను, భిన్న భాషల నుండి అనువాదాల ద్వారా జరిగే జ్ఞాన వినిమయాన్ని నిరాకరించటమే. ఈ రెండు సంఘటనలు పుస్తకాలు రాయటానికి , ప్రచురించటానికి అమ్మటానికి , భిన్న దృక్పథాల నుండి అధ్యయనం చేయటానికి పౌరులకు వుండే ఆసక్తులను , సృజన విమర్శ శక్తులను అణచివేయటాన్నే సూచిస్తున్నాయి. హృదయం, మెదడు లేకుండా తిరుగాడే యంత్రవతు మనుషుల వల్ల ఒక దేశం గొప్పది అవుతుందా?
కాత్యాయనీ విద్మహే
తెలంగాణ రాష్ట్రములో ఫాసిస్టు శక్తుల ప్రాబ ల్యం పెరిగింది అనేందుకు వరసగా జరుగుతున్న ఉదంతాలే సాక్ష్యం. పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన కొంతమంది ఇక్కడి ప్రజాస్వామిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. మెర్సీ, వేణుగోపాల్ మీద జరుగుతున్న దాడిని నేను ఖండిస్తున్నాను. భావ ప్రకటనా స్వేచ్ఛను ఫాసిస్టు శక్తులు హరిస్తూంటే, ప్రజాస్వామిక శక్తులు మౌనం వహించరాదని పిలుపునిస్తున్నాను.
డా.జిలుకర శ్రీనివాస్
విరుగుడు ఆలోచించాలి
సామాజిక మాధ్యమాలను ఉపయోగించి అబద్ధాలను గోబెల్స్ లాగా ప్రచారం చేస్తున్నా రు మనువాదులు. లక్షల ఉద్యోగస్తులను ఇందు కు ఉపయోగిస్తున్నారు. వారి అర్హత కేవలం ము స్లిం వ్యతిరేకంగా రాయడం, ప్రోగ్రెసివ్ శక్తులను టార్గెట్ చేయడం. ఇష్టమొచ్చినట్లు అబద్ధాలను అ క్షరాల్లో పెట్టడం. ఇప్పుడు ఇది తెలంగాణలో సా ధారణమై పోయింది. ఉత్తరాదిలో ఇలా మొదలైన వ్యవహారమే అక్కడి వారిని కలుషితం చేసిం ది. ఆ ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ వేగవంతమైంది. ఇం దుకు విరుగుడు ఆలోచించాలి. కమిటీగా ఏర్పడి ఎప్పటికప్పుడు ఉద్యమకారులను, రచయితలను కాపలా కాచుకోవాలి. లేదంటే నిజాలు మాట్లాడేవారు రాసేవారు తరిగిపోయే ప్రమాదముంది.
స్కైబాబ
విభేదాలు కాదు మనల్ని విడదీస్తున్నది. వాటిని గుర్తించి, అంగీకరించి, సంబరించలేని మన అసమర్థతే మనల్ని నిలువునా చీలుస్తున్నది. – ఆడ్రే లోర్దే సంభాషణలకు చోటు సమిసిపోవడం, విభేదాలకు చోటే లేకపోవడం, ఇంకో తరహా ఆలోచ న మనుగడే ప్రశ్నార్థకం కావడం, వాదన రద్దు కా వడం, నిరసన నిషేధమవ్వడం, విమర్శ ఆనవాలునే తుడిచిపెట్టడం, ఎలుగెత్తిన గొంతునూ నొక్కేయడం, మాటను కాలరాయడం, ప్రశ్నలు ఊచ లు లెక్కపెట్టడం, భిన్నత్వాలకు కాలం చెల్ల డం, బహుళత్వాన్ని బలవంతంగా చెరిపివేయడం ఇవ న్నీ నియంతృత్వ పాలన కాలసూచికలు. ఇప్పు డు ఆవరిస్తూ, విస్తరిస్తూ వున్నది ఈ ప్రమాదకర ధోరణే. విబేధాలు ఈ నేలలో వేదాలకన్నా పురాతనమైనవి. ఇప్పుడు పనిగట్టుకుని అసలు విబేధాలు లేనట్టు నటించడం, విబేధాలను తుడిపివేయాల ని, బలవంతంగా చెరిపివేయాలని మూకగా పూ నుకోవడం, విబేధాలను అంతం చేసి అఖండం చే యాలని కాలు దూయడం రెండు దశాబ్దాలుగా పెచ్చరిల్లుతున్న ప్రమాదకర అవివేకం. హింసాత్మ క అవివేకాన్ని బలంగా ఎదిరించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు ధిటవుగా నిలబడాల్సిన, తడబడకుండా కలబడాల్సిన కాలం ఇది.
అనంతు చింతలపల్లి
గత ఫిబ్రవరిలో జరిగిన ప్రరవే మహాసభల థీమ్ ట్రోలింగ్. రెండురోజుల పాటు అనేకమంది ఈ విషయం మీద మాట్లాడి, తమ అనుభవాలు చెప్పి వారికితోచిన సూచనలు ఇచ్చారు. మలుపు, ప్రరవే సంయుక్తంగా వేసిన ‘ట్రోల్’ పుస్తకంలో ట్రోలయిన కొంతమంది స్త్రీలు తమ అనుభవాలు పంచుకున్నారు. ఇప్పుడు ఇది అందరం గుర్తించి, సమస్యలా చూడాల్సిన విషయమని మెర్సీ, వేణులపై జరుగుతున్న ట్రోలింగ్ మళ్ళీ తెలియజెప్పింది. ముక్కూమొహం తెలీనివారు ఆన్లైన్లో తిట్టడం మాత్రమే ట్రోలింగ్ కాదు. భిన్నాభిప్రాయాలను సహించలేనివారు భౌతికదాడులకి దిగడానికి వీలుగా వారిని మొబిలైజ్ చేస్తుంది ట్రోలింగ్. ప్రజాస్వామికంగా లేని ఎవరిమాటనైనా తిరస్కరించడమే ట్రోలింగ్. అరికట్టడానికి వ్యక్తిగతస్థాయిలో మొదటిచర్య. ట్రోల్ చేసే స మూహాలు, ట్రోల్ కి గురయ్యేవారికన్నా పెద్దవిగా ఉంటాయి కనుక, ట్రోల్ వ్యతిరేకులు గట్టిగా అరిచి చెప్పగలశక్తిగా మారడానికి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
కె.ఎన్.మల్లీశ్వరి
చరిత్రలో యితర మతాల సాధకులను అణగదొక్కిన రాజులు వొక పక్కన వుంటే యితర మతాల ఆచారాలను గౌరవించి దాన ధర్మాలను చేసిన రాజులు కూడా వున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో సహన శీలత అలవర్చుకోటానికి ఆ వుదాహరణలు, ఆదర్శాలు యెందుకూ పనికిరావు. సమాజం యెప్పుడూ వొడిదుడుకుల తోటే వుంటుంది. అభిప్రాయాల మధ్యనా, ఆలోచనల మధ్యనా ఘర్షణ లేకపోతే సమాజం ముందుకు పోయేదెలా? కాబట్టి సహనశీలత అంటే ముందుకుపోవటానికి పనికొచ్చే ఘర్షణని పక్కదోవ పట్టించి మురుగు నీళ్ళల్లోకి తోసేసే ప్రయత్నాలను అడ్డుకోవడం అనే చెప్పుకోవాలి. సహనశీలత వుండాలని అని అనుకునే కన్నా… ఆరోగ్యకరమైన, ప్రయోజకరమైన చర్చను అడ్డుకునే ధోరణులను సహించరాదు అని చెప్పుకోవటం, అలా మన ఆచరణలో వుంచుకోవడం మంచిదని నా అభిప్రాయం.
కుప్పిలి పద్మ
ప్రజాస్వామిక లౌకిక వాదుల మీద, రా జ్యాం గం హామీ పడ్డ స్వేచ్ఛా సమానత్వ సౌభ్రాతృ త్వ భావనలను కాపాడే దిశగా కృషి చేసే సాహి త్యకారుల మీద, పితృస్వామ్య ఆధిపత్యాన్ని తిరస్కరించే మహిళా సామాజిక కార్యకర్తల మీద మ తోన్మాద శక్తులు విషం కక్కుతున్నాయి. సామాజి క మాధ్యమాల్లో వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ ప్రత్యక్షంగా చేస్తున్న వేధింపులు బెదిరింపులు భౌతిక దాడులు కేవలం వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛ ను హరించడంగా మాత్రమే పరిగణించలేం. వా టి వెనక మతవాద ఫాసిస్టు రాజకీయాల ప్రణాళికాబద్ధమైన కుట్రలున్నాయి. దళితులు స్త్రీలు మై నార్టీ మతస్తులు ప్రగతిశీల బుద్ధి జీవులే వాళ్ళ టార్గెట్. బైరి నరేష్, సంధ్య, సజయ, నిర్మల, మె ర్సీ, రాములు, స్కైబాబా, వేణుగోపాల్.. వీళ్లు వ్య క్తులు కాదు. భిన్న సమూహాల సముదాయాల భా వజాలాలకు ప్రతినిధులు. వారిపై దాడి మొత్తం పౌర సమాజంలో భావజాల రంగంలో పని చేస్తున్న బుద్ధి జీవుల మీద, రాష్ట్రంలో యావత్తు జ్ఞాన రంగం పై జరుగుతున్న దాడిగా పరిగణించాలి. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు మరింతగా విజృంభించకముందే పౌర సమాజంలో సహజీవన సంస్కృతికి విఘాతం కలిగించే శక్తుల్ని అడ్డుకోడానికి తగిన కార్యాచరణ రూపొందించుకోవా లి. విద్వేషానికి విరుగుడుగా ప్రేమైక నినాదాన్ని వినిపించడానికి సామూహికంగా పూనుకోవాలి.
ఎ.కె.ప్రభాకర్
రచయితల మీది ఈ అసహనాన్ని, దాడులను విడి సంఘటనలుగా చూడలేం. మతతత్వానికి సమాజంలోని అన్ని వర్గాల జనంలోనూ మద్ద తు పెరిగిందనటానికి ఇవి సూచికలు. ఈ ప్రమాదాన్ని విడివిడిగా ఎదుర్కోవటం కూడా అసాధ్యమే. ఇప్పటికీ న్యూట్రల్ గా మిగిలిన సమూహాలను కన్విన్స్ చెయ్యటానికీ, హేతుబద్ధతనూ, ప్రజాస్వామిక దృక్పథాన్నీ పెంచటానికీ మనం ఎంత సృజనాత్మకంగా, సంఘటితంగా పని చె య్యగలం అనేది మనముందున్న సవాలు. దీనికి నిరంతరంగా, ప్రణాళికా బద్ధంగా ఉండే కార్యాచరణను రూపొందించుకోవాలి.
కాత్యాయని
ఎన్ వేణుగోపాల్ పై, మెర్సీ మార్గరెట్ పై రెండు వేరు వేరు కారణాలతో దాడి జరిగినా, మూ ల కారణం ఒకటే. అది భావ ప్రకటనా స్వేచ్ఛపై అసహనంతో పేట్రేగిపోతున్న మతతత్వ శక్తుల నిర్హేతుక దాడి. మతం ముసుగులో అబద్ధాల పు నాదుల మీద రాజకీయ అధికార సౌధాలను ని ర్మించుకుంటున్న వారి అండదండలు ఈ శక్తుల కు పుష్కలంగా లభిస్తున్నాయి. ప్రశ్నకు తావు లే దు. నిరసనకు చోటు లేదు. విమర్శకు హక్కు లే దు. అన్ని రంగాలలో స్వాతంత్య్రం మీద ని యంతృత్వం ఉక్కు పాదం మోపుతున్న బీభత్స కాలం ఇది. ఖండనలతో సరిపోదు. తాత్కాలిక విభేదాల ను విస్మరించి, ఒక విశాల ఐక్యవేదిక మీద ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఏకమై ఒక సమూహంగా ఇలాంటి ఘటనలను ఎదుర్కోవడానికి సిద్ధం కా వాలి. మెర్సీ, వేణు, కేవలం ఇద్దరు వ్యక్తులు కా దు. భావజాల రంగంలో స్వేచ్ఛా స్వాతంత్య్రలను ప్రేమించే సమస్త సమూహాల ప్రతిరూపాలు వా రు. వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.
ప్రసాదమూర్తి
భావప్రకటన స్వేచ్ఛను హరించే పరిస్థితులు సమాజానికి నష్టం. పుస్తకాలు అమ్మడం, కొనడం మీద కూడా అసహనం మొదలైన పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. మాట్లాడ్డం మీద కూ డా తెలియని నియంత్రణ సాగుతున్న దశ ఉంది. సోషల్ మీడియాలో చెప్పడానికి వీలులేని దురు సు, అశ్లీల భాషలో తూలనాడే తిట్లు, బెదిరింపులు నడుస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. భవిష్యత్తు సమాజానికి ఇది ఎంతో కీడు చేస్తుంది. భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలను స్వీకరించే అవకాశం నానాటికి తగ్గిపోయే స్థితి నెలకొంటుంది. ఒకే మతం అనే భావనను స్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం. మానవాళి కలిసిమెలిసి జీవించే హక్కును కాలరాసే ఎటువంటి చర్యలనైనా నిలవరించే అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలపాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.
యాకూబ్
రచయితలు స్వేచ్ఛాజీవులు. అంతేకాదు ప్రజల గొంతుకలూ. ఆ గొంతుకలపైన దాడులు తెలుగు నేలలోనూ తీవ్రమయ్యాయని ఇటీవలి ఘటనలు రుజువు చేస్తున్నాయి. రచయితలు మొదట ఈ దేశ పౌరులు. వారికి ఈ దేశం వాక్ సభా స్వాతంత్య్రాలను హామీ పడింది. కొన్ని పార్టీ లు పనిగట్టుకుని, మాట్లాడే రచయితలపై దాడులకు తమ మూకలను ఉసిగోల్పుతున్నాయి. కన్న డ, మరాఠా, తమిళ నేలలో రచయితలపై జరిగినట్లు దాడులు తెలుగు నేలన జరగకుండా వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అరుణాంక్ లత
నచ్చని పుస్తకం అమ్ముతున్నందుకూ, నచ్చని శీర్షిక పెట్టినందుకూ దాడులు, దాష్టీకాలూ జరుగుతున్నాయంటే మనమెంత క్లిష్ట పరిస్థితుల్లో వున్నామో అర్థమవుతుంది. రాజ్యశక్తులే సనాతనానికి వత్తాసు పలుకుతూంటే, మధ్యతరగతి హిందూ ప్రజలను పట్టడానికి అవుతుందా.దీన్ని ఖండిస్తాం.ఇలా అయితే ప్రజాస్వామ్యం వున్నట్టేనా అనుకుంటాం.ఇంతకు మించి మనమేమైన చేయాల్సి వుందని గమనిస్తాం. దీన్నంతా సూక్ష్మ స్థాయిలో వివేచన చేయాల్సి వుంది. మద్దతుకు అటూయిటూగా క్షేత్ర స్థాయిలో ఆచరణను రూపొందించుకోవాల్సి వుంది.
జి.వెంకటకృష్ణ