Sunday, June 30, 2024

జెటిసి రమేష్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పంజాగుట్ట: ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీస్‌లో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమానుల్లాఖాన్ దౌర్జన్యం చేశారు. గత పది రోజులుగా దళారులను, మధ్యవర్తులను, బయటి సంస్థలను ఆర్టీఏ కార్యాలయం లోనికి అనుమతించకూడదంటూ అధికారులు కట్టడి చేయడంతో వివిధ సంఘాల నేతలకు, దళారులకు ఆర్టీఏ సిబ్బందితో రోజూ వాగ్వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కోవలో గురువారం సాయంత్రం ఆర్టీఏ ఆఫీస్‌లోకి చర్చకని వెళ్ళిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమానుల్లా ఖాన్.. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో వాదనకు దిగి చివరికి అతని చెంప మీద కొట్టాడు.

అమానుల్లా ఖాన్ దురుసు ప్రవర్తన నేటిది కాదు ఇంతకు ముందు కూడా ఆర్టీఓ అధికారి మాణిక్ ప్రభుపై కూడా చేయి చేసుకున్న సందర్భం ఉంది. అమానుల్లా ఖాన్ ప్రవర్తనకు కోపగించిన ఆర్టీఏ సిబ్బంది కార్యాలయంలో నిరసనకు దిగారు. కమిషనర్ రమేశ్, పలువురు సిబ్బంది కలిసి పంజాగు ట్ట పోలీస్ స్టేషన్‌లో అమానుల్లా ఖాన్‌పై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మరోవైపు అమానుల్లా ఖాన్ ఎఫ్‌ఐఆర్ నమోదవడంతో ఆటో సంఘాలు కూడా నిరసనలకు పూనుకుంటున్నట్టు సమాచారం.

దాడిని ఖండించిన మంత్రి పొన్నం
రవాణా శాఖ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పో ర్టు కమిషనర్ రమేశ్‌పై జరిగిన దాడిని రాష్ట్ర రవా ణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫి ర్యాదులు చేసుకోవాలి కానీ, ఇలా అధికారుల మీ ద దాడులు సరైంది కాదని మంత్రి అన్నారు. ఉ ద్యోగులపై దాడులు చేయడం సమస్యకు పరిష్కా రం కాదని, రవాణా శాఖ మంత్రిగా తాను ఉద్యోగులకు అండగా ఉంటానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దాడి గురించి పోలీసులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని తాము అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

ఖండించిన ఉద్యోగ సంఘాలు
ఇదిలాఉంటే రమేష్‌పై భౌతిక దాడి చేసిన ఆటో రి క్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రూప్1 ఆఫీసర్స్ అసోసియేషన్ డి మాండ్ చేసింది. ఈ పాశవిక దాడిని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవా లని టిఎన్జీఓల సంఘం డిమాండ్ చేసింది. మరోవై పు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్‌పై దాడికి నిరసన శుక్రవారం అన్ని కార్యాలయాల్లో పెన్‌డౌన్ నిర్వహించనున్నట్లు రవాణా శా ఖ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News