Sunday, January 19, 2025

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి: అలర్టైన ఇంటెలిజెన్స్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, అభ్యర్ధులకు అదనపు భద్రత

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అటు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఈ ఘటనతో అప్రమత్తమయ్యారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు కారు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్ధులకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఎలకు 2 ప్లస్ 2 భద్రత కల్పిస్తుండగా. దాడి నేపథ్యంలో దానిని 4 ప్లస్ 4కు పెంచాలని ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణలోని పోలీస్ కమీషనర్లు, ఎస్‌పిలకు ఆయన లేఖ రాశారు.

కుట్ర కోణం ఉందా, లేక ఇతరత్రా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
కాగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు అనే వ్యక్తి మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించనున్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభాకర్ రెడ్డి గన్ మెన్ దాడిని అడ్డుకున్నారు. లేకపోతే ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయాలై ఉండేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడితో ఆగ్రహంతో రాజును బిఆర్‌ఎస్ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన రాజును సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో రాజు చికిత్స పొందుతున్నారు. మరో వైపు వారం రోజులుగా రాజు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీయనున్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందా, లేక ఇతరత్రా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News