Friday, April 11, 2025

భైంసాలో ఉద్రిక్తత..కెటిఆర్‌ దాడి

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల వేళ నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్న బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉల్లిగడ్డలు, టమాటలు విసిరారు. కెటిఆర్ ప్రసంగిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బహిరంగంగానే దాడి జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం పూర్తైన తర్వాత పోలీసులు అందరినీ చెదరగొట్టారు. రాముడిని ఆరాధించే వారు ఎవరూ ఇలా ప్రవర్తించారని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News