Wednesday, January 22, 2025

గర్ల్‌ఫ్రెండ్‌తో సినిమా కెళితే చితక్కొట్టారు!

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: స్నేహితురాలితో కలసి సినిమా చూసేందుకు వచ్చిన ఒక విద్యార్థిపై అదే మతానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని సుళయ పట్టణంలోని ఒక సినిమా హాలు ఎదుట ఈ ఘటన జరిగినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మొహమ్మద్ ఇంతియాజ్ అనే 20 ఏళ్ల యువకుడు 18 ఏళ్ల తన స్నేహితురాలితో కలసి కాంతార సినిమా చూసేందుకు సినిమా హాలు వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో సినిమా చూసేందుకు అక్కడే ఉన్న అదే మతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. పెళ్లికాని అమ్మాయితో కలసి సినిమాకు రావడం తప్పని ఆగ్రహిస్తూ వారిపై దాడి చేశారు. దీనిపై ఇంతియాజ్, అతనిగర్ల్‌ఫ్రెండ్ సుళయా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అబ్దుల్ హమీద్, అతని మిత్రులుగా పోలీసులు గుర్తించారు. ఇంతియాజ్‌ను చంపుతామంటూ బెదిరించిన ఈ ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News