Wednesday, January 22, 2025

మాధవిలతపై దాడి కేసు.. ఎంఐఎం నాయకులపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పార్లమెంట్ బిజేపి అభ్యర్థిగా పోటీచేసిన కొంపెల్లి మాధవిలతపై దాడికి యత్నించిన ఎంఐఎం నాయకులపై మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిలత ప్రధాన అనుచరుడు నసీం ఫిర్యాదు మేరకు మొగల్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి యత్నించిన వారిపై ఐపిసి 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లతపై యాకత్ పూర ఎంఐఎం ఇన్‌ఛార్జ్ యాసిర్ అర్ఫాత్ దాడి చేసేందుకు ప్రయత్నించారని నసీం పేర్కొన్నారు. అంతేకాకుండా మాధవిలత కారులో వెళ్తున్న క్రమంలో కూడా పలువురు ఎంఐఎం నాయకులు వెంట పడి దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.

బీబీ బజార్‌లో మాధవిలతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో వారందరికీ పోలీసులు 41 సిఆర్‌పిసి నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో భారీ రిగ్గింగ్ జరిగిందని కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని మాధవిలత ఆరోపించారు. రిగ్గింగ్‌పై ఫిర్యాదులు చేసినా పోలీసులు మౌనంగా ఉంటున్నారని, ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల బాలిక రెండుసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News