ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై
కాట శ్రీనివాస్‌గౌడ్ అనుచరుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం
కార్యాలయంలో కెసిఆర్ ఫొటో ఉంచడంపై భగ్గుమన్న
కార్యకర్తలు కెసిఆర్ ఫొటో పెట్టుకుంటే తప్పేంటి?
ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి ఆగ్రహం పటాన్‌చెరు ఘటనపై
టిపిసిసి సీరియస్..విచారణకు కమిటీ ఏర్పాటు
మన తెలంగాణ/ పటాన్‌చెరు: పట్టణంలో కాంగ్రె స్ పార్టీ శ్రేణులు పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టకుండా మాజీ ము ఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంచడం ఎమిటని కాం గ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. ఈ మేరకు గురువా రం పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయా న్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ముట్టడించి క్యాంపు కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. అలాగే ముంబాయి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు
మాట్లాడుతూ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎ మ్మెల్యే మహిపాల్‌రెడ్డిని పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన వెంట బిఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అసలైన కాంగ్రెస్ కార్యకర్తల ను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాడన్నారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికి కార్యకర్తలు బలవంతంగా క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటో పెట్టారు.
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు తావులేదు : ఎమ్మెల్యె గూడెం
శిఖండి రాజకీయాలు మానుకో ప్రజాస్వామ్యం లో వ్యక్తిగత దాడులకు తావులేదు.. రెండుసార్లు ప్రజలు చీకొట్టిన బుద్ధి రాలేదా కాటా.. దమ్ముంటే నేరుగా ఎదుర్కో.. గోడల మీద కాదు.. గుండెల్లో ఉండాలి.. పటాన్‌చెరు ప్రజల అభివృద్ధి నా ప్రధా న ఎజెండా.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, బలోపేతం చేసేందుకే మా ప్రణాళికలు..తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం.. ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు కావాల్సిందే.. పటాన్‌చెరు ప్రజలు రెండుసార్లు చీకొట్టిన.. బుద్ధి మారకుండా తిరిగి నియోజకవర్గంలో శిఖండి రాజకీయాలు చే స్తూ వ్యక్తిగత దాడులకు పాల్పడడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సూచించారు. గురువారం ప టాన్‌చెరువు పట్టణంలోని క్యాంపు కార్యాలయంపై కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గానికి
సంబంధించిన వ్యక్తులు దాడి ఘటనను నిరసిస్తూ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే నివాసం ఉండే క్యాంపు కార్యాలయంపై కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం లాంటిదన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల హృదయాలను గెలుచుకోవడం జరిగిందని తెలిపారు. కాటా శ్రీనివాస్ గౌడ్‌కి అమీన్పూర్ సర్పంచ్‌గా ప్రజలు అవకాశం అందిస్తే ని ధులు పక్క దారి పట్టించి జైలు పాలు కావడంతోపాటు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి దా రుణ ఓటమికి గురైన వ్యక్తులు నేడు తనపై వ్యా ఖ్యలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నీచ రాజకీయాలను చూడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఫ్రొటోకాల్ ప్రకారం మాత్రమే ఆహ్వానాలు అందజేశారు తప్ప.. పార్టీలకు అనుగుణంగా ని ర్వహించడం జరుగుతుందా అని ప్రశ్నించారు.