Monday, December 23, 2024

మిస్టర్ టీ యజమానిపై దాడి

- Advertisement -
- Advertisement -

మిస్టర్ టీ యజమానిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన హస్తినపురంలోని హోటల్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మిస్టర్ టీ పేరుతో పలు ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన నవీన్ రెడ్డికి రాము గౌడ్‌కి ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. వీరి మధ్య విభేదాలు రావడంతో రాము గౌడ్ మరో ఇద్దరు కలిసి నవీన్‌రెడ్డిపై దాడి చేశారు.

దాడిలో నవీన్ రెడ్డి చేయి, భుజంపై గాయాలయ్యాయి, వెంటనే స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ రెడ్డి గతంలో ఓ వైద్యురాలు వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అరెస్టయిన నవీన్‌రెడ్డి బేయిల్ పై విడుదలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News