- Advertisement -
యాంగూన్ (మయన్మార్): మయన్మార్లో మిలిటరీ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్న వారిపై మిలిటరీ జుంటా అనుకూల వర్గాలు ఇనుపరాడ్లు, కత్తులుతో గురువారం తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. యాంగూన్ దిగువ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలతో సహా ప్రసారమయ్యాయి. అక్కడ పోలీసుల గస్తీ కాస్తున్నా ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఎలాంటి జోక్యం చేసుకోలేదు. దాడికి పాల్పడిన వారు ఇనుపరాడ్లతో, తుపాకీ కాల్పులతో ఆందోళనకారులపై మూకుమ్మడి దౌర్జన్యానికి దిగారు. ఒక ప్రభుత్వ కార్యాలయ భవనం ముందు ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. మిలిటరీకి మద్దతుగా వందలాది మంది గుంపుగా వచ్చి ప్రదర్శనలు సాగించారు. రక్షణ దళాలకు తాము అండగా ఉంటామని నినాదాలతో ప్ల కార్డులు ప్రదర్శించారు.
- Advertisement -