Friday, December 20, 2024

కడపలో నల్లగొండ ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిపై గ్రామస్థులు దాడిచేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని మైదుకూరు మండలంలోని చిన్నయ్యరాగిపల్లె గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నయ్యగారి పల్లెకె చెంది శివ, అతడి స్నేహితులు నల్లగొండ జిల్లా చెన్నంపేట పోలీస్ పరిధిలో గొర్రెలను కొనుగోలు చేశారు. గొర్రెలను కొనుగోలు చేసినప్పటికి డబ్బులు లేకపోవడంతో రూ.30 లక్షలు అప్పులు పెట్టారు. శివ డబ్బులు చెల్లించకపోవడంతో చెన్నంపేట పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సతీశ్, ఇద్దరు కానిసేబుళ్లు, బాధితులతో సహా చిన్నగారిపల్లె గ్రామానికి చెరుకున్నారు. శివ ఇంటికి వెళ్లిన తరువాత పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో శివ మరో పది మందితో కలిసి ఎస్‌ఐ, సిబ్బంది, బాధితులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీస్ వాహనాల అద్దాలను ధ్వంసం చేయడంతో బాధితులు వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News