- Advertisement -
వర్రి (నైజీరియా) : ఆగ్నేయ నైజీరియా ఓవెరి పట్టణంలోని కారాగారంపై మంగళవారం తెల్లవారు జాము 2 గంటల ప్రాంతంలో సాయుధులైన మిలిటెంట్లు దాడి చేయడంతో 1800 మంది ఖైదీలు పరారయ్యారు. మెషిన్ గన్సు, రాకెట్ గ్రెనేడ్లతో రెండు గంటల పాటు మిలిటెంట్లు కాల్పులు సాగించారు. పోలీస్, మిలిటరీ భవనాలను లక్షంగా పెట్టుకుని దాడి చేశారని స్థానికులు తెలిపారు. అయితే పరారైన ఖైదీలను పట్టుకోడానికి గట్టిగా ప్రయత్నిస్తామని నైజీరియా జైలు అధికార ప్రతినిధి ఫ్రాన్సిస్ ఎనొబోర్ చెప్పారు. ఈ దాడికి బాధ్యులెవరో ఇంకా తెలియనప్పటికీ వేర్పాటు ఉద్యమానికి చెందిన ఈస్టర్న్ సెక్యూరిటీ నెట్‌వర్క్ పారామిలిటరీ వింగ్ ఈ దాడి చేసి ఉంటుందని నైజీరియా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనుమానిస్తున్నారు.
- Advertisement -