Sunday, December 22, 2024

ఈఎంఐ కట్టలేదని దాడి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ఈఎంఐ కట్టలేదని ఓ యువకుడిని చితకబాదిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సోమాజిగూడ ఎల్‌అండ్‌టీ ల్లో ఐదు నెలల క్రితం నరేష్ అనే యువకుడు యాక్టివా బైక్‌ను ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. నాలుగు నెలల నుంచి నరేష్ ఈఎంఐ నిర్ణీత సమయానికి చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక నెల ఈఎంఐ కట్టలేకపోయాడు. దీంతో బాధితుడి ఇంటికి వచ్చిన ఏడుగురు రికవరీ ఏజెంట్లు నరేష్ ఇంట్లో లేకపోవడంతో అతడి సోదరుడు శ్రీనివాస్‌పై దాడి చేశారు. చెవిపై కొట్టడంతో యువకుడు వినికిడి కోల్పోయాడు. దీంతో బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News