Sunday, April 27, 2025

పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బిఎల్‌ఎ) ఉగ్రవాదులు మరోసారి పాకిస్థాన్ ఆర్మీపై దాడికి తెగబడ్డారు. పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్‌ చేసిన దాడిలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడిలో ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇది బలూచ్ విప్లవకారుల యుద్ధం అని ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్ధాలు, ధ్వంసమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే బిఎల్‌ఎ వెల్లడించింది. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు అని.. తమ హక్కుల కోసం చివరిదాక పోరాడుతామని బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్‌ ప్రకటించారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News