Monday, December 23, 2024

యాద్రాదిలో 9 మంది పేకాట రాయుళ్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తాళ్లగుడెం శివారులో పేకాట స్థావరంపై ఎస్‌ఒటి పోలీసులు దాడులు చేశారు. స్థానికుల సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశామని ఎస్‌ఒటి పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.65 వేల నగదు, పది స్మార్ట్ ఫోన్లు, రెండు కార్లు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లు నమిలి నాగేష్(పెద్ద కందుకూరు), బనాలా రాజు(పెద్ద కందుకూరు), అవుల నరసింహా(యాదగిరి గుట్ట), పసల బాలస్వామి(కమ్మగూడె, అలేరు), కదీర్ పాషా(ఆలేరు), గుండ్లపల్లి శేఖర్(పెద్ద కందుకూరు), గందమళ్ల కిశోర్ (పెద్ద కందుకూరు), అబ్దుల్ గఫర్(ఆలేరు) గ్రామాలకు చెందిన వారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News