Monday, January 20, 2025

పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలోని పొన్నాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ దాడిలో  ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 21,490 రూపాయలు, ఐదు మోటర్ సైకిళ్లు , నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై టాస్క్ పోర్క్ ఇన్‌స్పెక్టర్ రమేశ్

సిబ్బందితో కలిసి వెళ్లి రైడ్ చేసి 05 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో, ఫామ్ హౌస్‌లలో ఇళ్లల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని కోరారు. పేకాట, జూదం, వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News