Monday, December 23, 2024

విందు ఆపమన్నందుకు పోలీసులపై దాడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సమయం మించి పోవడంతో విందును ఆపివేయాలని చెప్పేందుకు వెళ్లిన పోలీసులపై దాడ చేసిన సంఘటన మెహదీపట్నంలో చోటుచేసుకుంది. అంబాగార్డెన్ సమీపంలోని నల్ల పోచమ్మ టెంపుల్ దగ్గర కొందరు విందు చేసుకుంటున్నారు. విందు సమయం మించిపోవడంతో ఆపేందుకు ఆసిఫ్‌నగర్ ఎస్సై తేజ, కానిస్టేబుల్ వెళ్లారు. అక్కడ విందు చేసుకుంటున్న వారిని వెంటనే విందు ఆపివేయాలని కోరారు. దీంతో ఆగ్రహించిన పవన్, విజయ్, శ్రీను కలిసి ఒక్కసారిగా ఎస్సై తేజ, కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీసులపై దాడి చేసిన పవన్ అనే యువకుడు జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News