Sunday, December 22, 2024

పోస్టుమ్యాన్ పై దాడి.. తీవ్రగాయాలతో పిఎస్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఆరె మైసమ్మ వద్ద పోస్టుమ్యాన్ పై శనివారం దాడి జరిగింది. రిజిస్టర్ పోస్టు ఇవ్వలేదని పోస్టుమ్యాన్ సతీష్ పై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రిజిస్టర్ పోస్టుపై పేరు ఉన్న వ్యక్తి లేరని పోస్టుమ్యాన్ వెనుదిరిగాడు. తనకు ఎందుకు ఇవ్వట్లేదని బండరాయితో పోస్టుమ్యాన్ మరో వ్యక్తి కొట్టాడు. రిజిస్టర్ పోస్టు ఎవరి పేరు ఉందో వారికే ఇస్తామని పోస్టుమ్యాన్ చెప్పాడు.

అయిన వినకుండా ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో పోస్టుమ్యాన్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో తక్షణమే అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పోస్టుమ్యాన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News