Sunday, December 22, 2024

ప్రభాకర్‌రెడ్డిపై దాడి దారుణం : ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి జరుగడం దారుణం. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్లే ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. నిన్న దుబ్బాక నియోజకవర్గంలో కత్తి పోటుకు గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు.

ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉందని ధైర్యం చెప్పారు. వైద్యుల అనుమతితో ప్రభాకర్‌రెడ్డిని కలిసి మంత్రి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News