Wednesday, January 22, 2025

కిడ్నాపర్ నెపంతో దాడి.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నిజామాబాద్ బ్యూరో : అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చాడనే అనుమానంతో స్థానికులు మూకుమ్మడిగా దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని గాయత్రీనగర్ శి వారులో బీమారాయి గుడి వద్ద సోమవారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. స్థానికులు అతనిని పట్టుకొని విచారించా రు. తాను దుబ్బ ప్రాంతానికి చెందిన రాజుగా చెప్పాడు. గతంలో పశువులు కాసే వాడినని, తనకు దేవుడు వస్తాడని అందుకే ఈ గు డికి వచ్చాన్నారు. కానీ అతని మాటలు ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోవడంతో వారంతా మూకుమ్మడిగా కర్రలు, చేతులతో కొట్టా రు. తాను కిడ్నాప్‌లు చేయడానికి రాలేదని ఆ వ్యక్తి ప్రాధేయపడ్డా డు. అయినా స్థానికులు పట్టించుకోలేదు. ఈలోపు స్థానికులు డయ ల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీనితో నాలుగో టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి చేతులు రెండూ విరిగిపోయాయి. రాజుపై దాడి చేసిన వారిపై హత్య కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News