Thursday, January 23, 2025

కారు, బస్సు వివాదం

- Advertisement -
- Advertisement -
Attack on Private Travels driver in hyderabad
ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌పై దాడి
బస్సు మిర్రర్ ధ్వంసం
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపై దాడికి యత్నం

హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు వివాదం ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు సైడ్ ఇవ్వాలని హారన్ పదేపదే కొడుతున్నారు. బస్సు డ్రైవర్‌కు కారుకు సైడ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ముందు చాలా ట్రాఫిక్ ఉండడంతో వాటి వెనుక వెళ్తున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన కారులో ఉన్న వ్యక్తి బస్సు ముందుకు వచ్చి సైడ్ ఇవ్వడంలేదని దాడి చేశాడు. బస్సును ధ్వంసం చేసేందుకు యత్నించగా డ్రైవర్ అడ్డుకున్నాడు. దీంతో బస్సు మిర్రర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. అక్కడ ఉన్న వారు సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు.

అక్కడ ఉన్న వారిని నుంచి వివరాలు తెలుసుకుని దాడి చేసిన వారిని, బస్సుడ్రైవర్‌ను పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా అక్కడికి వచ్చిన ఓ వర్గానికి చెందిన వారు పోలీస్ వాహనంపై దాడి చేశారు. వెంటనే మిగతా పోలీసులకు సమాచారం ఇవ్వగా నైట్‌డ్యూటీలో ఉన్న నాంపల్లి ఇన్స్‌స్పెక్టర్ ఖలీల్‌పాషా వెంటనే అక్కడికి చేరుకున్నారు. తమ వర్గానికి చెందిన మహిళపై దాడి చేశారని ఆరోపిస్తు ధర్నాకు దిగారు. వారికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇరువురి ఫిర్యాదులు తీసుకున్న సైఫాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి దాడి చేయకున్నా లాఠీలతో కొట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంఘటన స్థలంలో ఉన్న వారు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News