Thursday, January 23, 2025

భారతీయ సంతతి సిక్కు టాక్సీడ్రైవర్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

Attack on Sikh taxi driver of Indian descent at JFK Airport

 

న్యూయార్క్ : న్యూయార్క్ లోని జెఎఫ్‌కె అంతర్జాతీయ విమానాశ్రయం బయట భారతీయ సంతతికి చెందిన సిక్కు టాక్సీడ్రైవర్‌పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. పిడిగుద్దులతో దాడి చేస్తూ అతని తలపాగాను ఊడబెరికాడు. ఇదంతా సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. తేదీ లేని 26 సెకండ్ల వీడియో ను నవజ్యోత్ పాల్ కౌర్ అనే ఆమె తన టిటర్‌లో జనవరి 4 న అప్‌లోడ్ చేసుకుంది. విమానాశ్రయం వద్ద నున్న ఒక వ్యక్తి ఈ వీడియోను తీశాడని ఆమె చెప్పింది. దుండగుడు అశ్లీల పదాలతో దూషించడం ఇందులో వినిపించింది. సమాజంలో విద్వేషపూరిత నేరాలు కొనసాగుతున్నాయన్న వాస్తవాలను చూపించడానికే ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు ఆమె చెప్పింది. సిక్కు క్యాబ్ డ్రైవర్లు అమెరికాలో తరచుగా దాడులకు గురి అవుతున్నారని ఆమె ఆరోపించారు. సిక్కు సమాజం సభ్యులు ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News